Bhadradriలో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-05-21T15:12:29+05:30 IST

జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా ఝార్ఖండ్‌కు కారులో గంజాయిని తరలించేందుకు దుండగులు యత్నించారు.

Bhadradriలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా ఝార్ఖండ్‌కు  కారులో గంజాయిని  తరలించేందుకు దుండగులు యత్నించారు. ఈ క్రమంలో భద్రాచలం శివారు ప్రాంతంలో కారును ఆపేందుకు ఎక్సయిజ్ శాఖ సిబ్బంది ప్రయత్నించింది. కారు ఆపకుండా వేగంగా వెళ్ళిపోయిన ఇద్దరు గంజాయి దొంగలు రామాలయం ప్రాంతంలో గంజాయితో సహా కారును వదిలేసి పరారయ్యారు. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కారుతో పాటు కారులో ఉన్న సుమారు 150 కేజీల గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-05-21T15:12:29+05:30 IST