అతనికి మరో రెండు మ్యాచులే అవకాశం: ఇంగ్లండ్ మాజీ పేసర్

ABN , First Publish Date - 2020-07-14T03:55:28+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా రద్దయిన క్రికెట్ కార్యక్రమాలు ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టులతో మళ్లీ ప్రారంభమయ్యాయి.

అతనికి మరో రెండు మ్యాచులే అవకాశం: ఇంగ్లండ్ మాజీ పేసర్

లండన్: కరోనా మహమ్మారి కారణంగా రద్దయిన క్రికెట్ కార్యక్రమాలు ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టులతో మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే ఈ సిరీస్ తొలి మ్యాచులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్ స్పందించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ లక్ష్యంగా డారెన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో బట్లర్ రాణించాలని, లేదంటే టెస్టుల్లో అతని కెరీర్ ముగిసినట్లేనని చెప్పాడు. ‘మైదానంలోకి అలా వచ్చి అవుటై వెళ్లిపోకూడదు. కానీ బట్లర్ అదే చేస్తున్నాడు. ఇలాగైతే అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్లే’ అని డారెన్ అన్నాడు. విండీస్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టుల్లో రాణించకపోతే ఇక టెస్టుల్లో బట్లర్ కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, గత 12 టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా బట్లర్ కనీసం హాఫ్ సెంచరీ మార్కు దాటలేదు.

Updated Date - 2020-07-14T03:55:28+05:30 IST