విజయవాడలో HCL ఫౌండేషన్ గ్రాంట్ ఎడిషన్

ABN , First Publish Date - 2022-05-19T23:54:51+05:30 IST

హెచ్‌సీఎల్ ఫౌండేషన్ విజయవాడలో ‘హెచ్‌సీఎల్ గ్రాంట్ ఎడిషన్ 8 కోసం పాన్ ఇండియా సింపోజియం ‘సీఎస్ఆర్ ఫర్

విజయవాడలో HCL ఫౌండేషన్ గ్రాంట్ ఎడిషన్

విజయవాడ: హెచ్‌సీఎల్ ఫౌండేషన్ విజయవాడలో ‘హెచ్‌సీఎల్ గ్రాంట్ ఎడిషన్ 8 కోసం పాన్ ఇండియా సింపోజియం ‘సీఎస్ఆర్ ఫర్ నేషన్ బిల్డింగ్’ రెండో ఎడిషన్‌ను నిర్వహించింది. ఈ సంస్థకు చెందిన సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగం, హెచ్‌సీఎల్ ఫౌండేషన్, ఎన్‌జీవోలు, పొరుగు రాష్ట్రాల కోసం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్‌లో హెచ్‌సీఎల్ గ్రాంట్ ఎడిషన్ 8 కోసం ఈ సింపోజియంను నిర్వహించింది.


ఇందులో ఎన్‌జీవో‌లు, పౌర సమాజ నిపుణులతో ‘స్క్రిప్టింగ్ ఇండియాస్ రూరల్ డెవలప్‌మెంట్’పై చర్చాగోష్టి జరిగింది. 160 మంది ఎన్‌జీవోలు పాల్గొనగా, 250 మందికిపైగా అనేక ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి, సచింద్ర సాహు, హెచ్‌సీఎల్ ఫౌండేషన్ లీడ్ హెల్త్ డాక్టర్ చేతన తదితరులు పాల్గొన్నారు. రీచా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిఖిల్ పంత్ మోడరేట్ చేశారు. 

 

 హెచ్‌సీఎల్ ఫౌండేషన్ విజయవాడలో సింపోజియం నిర్వహించడం ఇది రెండోసారి.  2018లో జరిగిన మొదటి సింపోజియమ్‌కు రాష్ట్రంలోని ఎన్‌జీవోల నుంచి విశేష స్పందన లభించింది. హెచ్‌సీఎల్ గ్రాంట్ సింపోజియంలను ఈ ఏడాది దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తారు. తాజా ఎనిమిదో ఎడిషన్‌లో విద్య, ఆరోగ్యం, పర్యావరణం విభాగాల్లో గ్రాంట్లు అందజేస్తారు.


ప్రతి కేటగిరీలో మూడేళ్ల ప్రాజెక్ట్ కోసం రూ 5 కోట్లు విడుదల చేస్తుంది. ఏడాది ప్రాజెక్ట్ కోసం ఇతర ఫైనలిస్ట్‌లకు రూ. 25 లక్షల రివార్డ్ ఇస్తుంది. ఎనిమిదో ఎడిషన్ కోసం కట్టిన మొత్తం ఫండ్ రూ.16.5 కోట్లు. హెచ్‌సీఎల్ గ్రాంట్ రిజిస్ట్రేషన్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. 2016 నుంచి హెచ్‌సీఎల్ గ్రాంట్ కింద 35 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు, 7500కుపైగా దరఖాస్తులు వచ్చాయి.  


 ఈ సందర్భంగా హెచ్‌సీఎల్ ఫౌండేషన్ డైరెక్టర్ నిధి పుంధీర్ కోట్ మాట్లాడుతూ.. సింపోజియంకు అద్భతమైన స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.  దేశంలోని ఎన్జీవోలు, ప్రభుత్వం, కార్పొరేట్లు, విధాన నిర్ణేతలను ఒకే తాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. మెరుగైన భారతదేశాన్ని నిర్మించడంలో వారికి మద్దతు ఇస్తామన్నారు. ఏపీ హెచ్ఆర్‌డీ మాజీ డైరెక్టర్ జనరల్, రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి మాట్లాడుతూ.. సాంకేతిక పురోగతులు, అవకాశాలను నిర్మించేటప్పుడు అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించడానికి, సద్వినియోగం చేసుకోవాలనే కోరిక అత్యవసరమన్నారు. 

Updated Date - 2022-05-19T23:54:51+05:30 IST