అంబేద్కర్ పటిష్ట రాజ్యాగంవల్లే దేశం సుస్థిరంగా ఉంది: మంత్రి హరీశ్ రావు

ABN , First Publish Date - 2021-04-14T16:17:39+05:30 IST

అంబేద్కర్ పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని హరీశ్ రావు అన్నారు.

అంబేద్కర్ పటిష్ట రాజ్యాగంవల్లే దేశం సుస్థిరంగా ఉంది: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా: కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి.. అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. బుధవారం సిద్ధిపేట పాత బస్టాండ్ కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  అంబేద్కర్ పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందన్నారు. సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పింది అంబేద్కరేనని అన్నారు. ఆయన బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామన్నారు. ఈ సారి అసెంబ్లీ బడ్జెట్‌లో దళిత్ ఎంపవర్మెంట్ కింద వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపు చేసుకున్నామని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-14T16:17:39+05:30 IST