హరీశ్‌రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-06-21T02:33:20+05:30 IST

హరీశ్‌రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

హరీశ్‌రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

సిద్దిపేట: మంత్రి హరీశ్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. కొండపాక మండలం దుద్దెడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అడవి పందులు అడ్డు‌రావడంతో హరీశ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీశ్ రావుకు స్వల్ప గాయాలయ్యాయినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌తో పాటు గన్‌మెన్‌కు కూడా గాయాలయ్యాయి. కారు వెనుక సీట్లో హరీశ్‌రావు కూర్చోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే హరీశ్ రావు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. హరీశ్ డ్రైవర్, గన్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తప్పడంతో ఆయన మరో కారులో వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో దుద్దెడ వద్ద కొంతసేపు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. 





Updated Date - 2021-06-21T02:33:20+05:30 IST