కార్ల్‌సన్‌కు హరికృష్ణ చెక్‌

ABN , First Publish Date - 2020-09-20T09:15:56+05:30 IST

యింట్‌ లూయిస్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ సంచలన విజయం నమోదు చేశాడు.

కార్ల్‌సన్‌కు హరికృష్ణ చెక్‌

చెన్నై: సెయింట్‌ లూయిస్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ సంచలన విజయం నమోదు చేశాడు. బ్లిట్జ్‌ విభాగంలో ప్రపంచ నెంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)కు హరి షాకిచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన 9 రౌండ్లలో హరి రెండు గెలిచి, నాలుగు ఓడాడు. మూడు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. 3వ రౌండ్‌లో హరి 63 ఎత్తుల్లో వరల్డ్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌ను ఓడించాడు. అంతకుముందు తొలి రెండు రౌండ్లలో పెరెజ్‌ (అమెరికా), వెస్లే (అమెరికా) చేతిలో ఓడాడు. ఇక 4వ రౌండ్‌లో జెఫ్రీ జింగ్‌ (అమెరికా)పై నెగ్గాడు. నకముర, అరోనియన్‌, నెపోమ్నియాంచిలతో 5, 6, 7 రౌండ్లను డ్రా చేసుకున్నాడు. కానీ, 8, 9 రౌండ్లలో గ్రిస్చుక్‌, అలీరెజా చేతిలో ఓడాడు. ప్రస్తుతం కార్ల్‌సన్‌ (18.5) టాప్‌లో, హరి (12.5) ఆరో స్థానంలో ఉన్నారు. 

Updated Date - 2020-09-20T09:15:56+05:30 IST