మంత్రి మేకపాటి ట్విటర్ హ్యాక్
ABN , First Publish Date - 2021-04-11T09:30:58+05:30 IST
మంత్రి మేకపాటి ట్విటర్ హ్యాక్
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ విషయాన్ని మంత్రి ట్విటర్ ద్వారా శనివారం వెల్లడించారు. ‘‘కొన్ని అసాంఘిక శక్తులు నా ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశాయి. సంబంధం లేని, రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడుతున్నాయి. వాటిని పట్టించుకోవద్దు. దీనిపై ఏపీ పోలీస్ 100కు ఫిర్యాదు చేశాను’’ అని మంత్రి తెలిపారు.