గురువారం నుంచి ప్రారంభం కానున్న జిమ్‌లు
ABN , First Publish Date - 2020-08-05T20:00:38+05:30 IST
అన్ లాక్ 3.Oలో భాగంగా జిమ్‌లు తిరిగి గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: అన్ లాక్ 3.Oలో భాగంగా జిమ్‌లు తిరిగి గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. జిమ్స్ ప్రారంభించుకోవచ్చునని కేంద్ర హోం శాఖ కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. నాలుగు నెలలుగా మూతపడిన జిమ్‌లు తిరిగి గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మార్చి 22 జనతా కర్ఫ్యూ తర్వాత జిమ్‌లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు జిమ్‌లు నిర్వహిస్తామన్నారు. జిమ్‌కు వచ్చిన కస్టమర్ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ తీసుకుంటామని, ధర్మల్ స్క్రీనింగ్, టెంపరేచర్ చెక్ చేస్తామని చెప్పారు. ఆరోగ్య పరంగా బాగుంటేనే జిమ్‌కు అనుమతిస్తామని స్పష్టం చేశారు.