జీవీకే పవర్‌ ఆడిటర్‌ రాజీనామా

ABN , First Publish Date - 2020-08-15T06:15:17+05:30 IST

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాట్యుటరీ ఆడిటర్‌ హోదా నుంచి తప్పుకోవాలని ప్రైస్‌ వాటర్‌హౌస్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ నిర్ణయించింది. 2017 సెప్టెంబరులో ప్రైస్‌ వాటార్‌హౌస్‌ను ఐదేళ్లపాటు స్టాట్యుటరీ ఆడిటర్‌గా జీవీకే పవర్‌ నియమించింది...

జీవీకే పవర్‌ ఆడిటర్‌ రాజీనామా

హైదరాబాద్‌ (ఆధ్రజ్యోతి బిజినెస్‌): జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాట్యుటరీ ఆడిటర్‌ హోదా నుంచి తప్పుకోవాలని ప్రైస్‌ వాటర్‌హౌస్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ నిర్ణయించింది. 2017 సెప్టెంబరులో ప్రైస్‌ వాటార్‌హౌస్‌ను ఐదేళ్లపాటు స్టాట్యుటరీ ఆడిటర్‌గా జీవీకే పవర్‌ నియమించింది. 2019-20 ఏడాదికి చెందిన ఖాతాల ఆడిట్‌కు అవసరమైన సమాచారాన్ని కంపెనీ అందించడం లేదని పేర్కొంటూ.. స్టాట్యుటరీ ఆడిటర్‌ హోదా నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు ప్రైస్‌ వాటర్‌హౌస్‌ తెలిపింది.


ఈ మేరకు రాజీనామా లేఖను గురువారం జీవీకే పవర్‌ ఆడిట్‌ కమిటీకి పం పింది. స్టాట్యుటరీ ఆడిటర్‌ రాజీనా మా లేఖను పంపినట్లు జీవీకే వెల్లడించింది. అనేక మార్లు కోరినప్పటికీ.. అవసరమైన సమాచారాన్ని కంపెనీ అందించలేదని ప్రైస్‌ వాటర్‌ లేఖలో తెలిపింది. జీవీకే పవర్‌ అనుబంధ కంపెనీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల జరిగిన పరిణామాలతో సహా అనేక అంశాలపై సమాచారాన్ని కోరినట్లు పేర్కొంది. నిధులను మళ్లించడం, ఖాతాల్లో అంకెలను తారుమారు చేశారన్న ఆరోపణలపై ఇటీవల జీవీకే గ్రూప్‌ చైర్మన్‌ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు సంజయ్‌ రెడ్డిపై సీబీఐ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా విచారణ జరుపుతోంది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా ప్రైస్‌ వాటర్‌ రాజీనామా చేసింది. సెబీ నిబంధనల ప్రకారం కంపెనీ నుంచి అవసరమైన సహకారాన్ని ఆశించామని పేర్కొంది. 

Updated Date - 2020-08-15T06:15:17+05:30 IST