యథేచ్ఛగా నాసిరకం మద్యం అమ్ముతున్న చర్యలేవీ? : జీ.వీ.రెడ్డి

ABN , First Publish Date - 2022-03-19T20:58:32+05:30 IST

నాటుసారా, కల్తీమద్యానికి బలైన బాధితుల కుటుంబాలకు ఎల్జీపాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చినట్టే వైసీపీ ప్రభుత్వం కోటిరూపాయల పరిహారం ఇవ్వాలని ..

యథేచ్ఛగా నాసిరకం మద్యం అమ్ముతున్న చర్యలేవీ? :  జీ.వీ.రెడ్డి

అమరావతి: నాటుసారా, కల్తీమద్యానికి బలైన బాధితుల కుటుంబాలకు ఎల్జీపాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చినట్టే వైసీపీ ప్రభుత్వం కోటిరూపాయల పరిహారం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి  జీ.వీ.రెడ్డి   అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్‌రెడ్డి తనకు చెడ్డపేరు రాకూడదన్న దురుద్దేశంతోనే నాటుసారా మరణాలను సహజమరణాలంటున్నాడు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో డబ్బే ఎందుకు తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి. మద్యం విక్రయాలతో వేలకోట్లు టర్నోవర్ చేస్తూ క్యాష్ లెస్ లావాదేవీలు జరపకపోవడం వెనుక వేలకోట్ల సొమ్ము అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మంతా ముఖ్యమంత్రి ఖజానాకు చేరుతోందనే వాస్తవాన్ని ప్రజలంతా గమనించాలి. జగన్మోహన్‌రెడ్డి  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి , ఇప్పుడు ఎందుకు బుద్ధిలేని పనులు చేస్తున్నాడు? అని’’ జీ.వీ.రెడ్డి ప్రశ్నించారు. 


‘‘మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని గతంలో గగ్గోలు పెట్టిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు అవే తాళిబొట్లు తెంపుతూ, తన ఖజానా ఎందుకు నింపుకుంటున్నాడు?. యథేచ్ఛగా రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలు ఎందుకు తీసుకోట్లేదు. మద్యపాన విమోచన కమిటీని ఎందుకు తీసుకొచ్చాడు?. మద్యాన్ని తాగవద్దని దాని వల్ల ప్రాణాలు పోతాయని ప్రజలకు చెప్పలేని కమిటీతో ఎవరికి లాభం?. ఏనాడైనా సీఎం జగన్మోహన్‌రెడ్డి తన సాక్షి పత్రిక ద్వారా గానీ, తనకు తానుగా గానీ మద్యం తాగవద్దని చెప్పాడా?.టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో మద్యం అమ్మకాలపై రూ.40వేల కోట్లు వస్తే, జగన్మోహన్ రెడ్డి కేవలం మూడేళ్లల్లోనే రూ.90వేల కోట్లు కొల్లగొట్టాడు. రాష్ట్రంలో పేదలను బలితీసుకుంటున్న నాసిరకం మద్యాన్ని అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోదు. ప్రజలు ఛస్తే చచ్చారు.. మాకేంటి.. మా ఖజానా నిండితే చాలన్నట్టు ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మద్యం అమ్మకాలు, మద్యం తయారీ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము ముఖ్యమంత్రికి ఉందా?’’ అని  జీ.వీ.రెడ్డి నిలదీశారు.

Updated Date - 2022-03-19T20:58:32+05:30 IST