తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్కు సోయిలేదు:గుత్తా సుఖేందర్ రెడ్డి
ABN , First Publish Date - 2021-04-15T15:18:30+05:30 IST
తెలంగాణ విషయంలో జానారెడ్డికి ఎప్పుడూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
నల్లగొండ: తెలంగాణ విషయంలో జానారెడ్డికి ఎప్పుడూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదని టీఆర్ఎస్ నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం, నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు దురాశతో కేసీఆర్ పార్టీని విలీనం చేస్తామన్నా విభేదించారన్నారు. అధికారం రాలేదన్న బాధ తప్ప.. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్కు సోయి లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి టీడీపీని ముంచి కాంగ్రెస్లో చేరారన్నారు. జానారెడ్డికి సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడం ఇష్టం లేదని, పార్టీ అధిష్టానం బలవంతంగా నిలబెట్టిందని జానారెడ్డే చెప్పారన్నారు. శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నా.. తన పేరు ప్రచారంలో ఉపయోగిస్తున్నారు కాబట్టే స్పందిస్తున్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.