Abn logo
May 9 2021 @ 00:23AM

రూ.6 లక్షల విలువైన గుట్కాల పట్టివేత

వరంగల్‌ అర్బన్‌ క్రైం, మే 8 : ఇంతేజార్‌గంజ్‌, హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో గుట్కాలు, అంబర్లు విక్రయిస్తున్న ముఠాసభ్యులను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివా్‌సజీ తెలిపారు. ఇంతేజార్‌గంజ్‌ పరిధిలో ఎమ్డీ శంషోద్దీన్‌, ఎమ్డీ హాజీపాషా, ఎమ్డీ ఇద్రీస్‌, హన్మకొండ పీఎస్‌ పరిధిలో బింగి రమేష్‌, ఎమ్డీ తాజోద్దీన్‌, ఎమ్డీ హాజీపాషా ముఠాగా ఏర్పడి బీదర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి గుట్కాలు, అంబర్‌లు  దిగుమతి చేసుకొని రాత్రి సమయాల్లో రిటైల్‌ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం భారగా గుట్కాలు దిగుమతైనట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. వారిపై కేసులు నమోదు స్వాధీనం చేసుకున్న గుట్కాలను సంబంధిత పోలీసుస్టేషన్‌లలో అప్పగించారు.