IPL 2022: ఆశిష్ నెహ్రా నయా చరిత్ర.. IPLలో అరుదైన రికార్డ్ సొంతం

ABN , First Publish Date - 2022-05-30T20:19:26+05:30 IST

గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ప్లేయర్లు బాగా ఆడితే సంతోషంతో మురిసిపోయాడు.. పేలవ ప్రదర్శన చేస్తే కుటుంబ

IPL 2022: ఆశిష్ నెహ్రా నయా చరిత్ర.. IPLలో అరుదైన రికార్డ్ సొంతం

ముంబై : గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ప్లేయర్లు బాగా ఆడితే సంతోషంతో మురిసిపోయాడు.. పేలవ ప్రదర్శన చేస్తే కుటుంబ పెద్దలా కోపంతో ఊగిపోయాడు. మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంటే మైదానంలో ఆటగాళ్లను మించిన టెన్షన్‌తో గోళ్లు కొరుక్కుంటూ కనిపించాడు. మొత్తంగా ఓ కొత్త జట్టు ఐపీఎల్2022 టైటిల్‌ను ఎగురేసుకుపోవడం వెనుక విశేష పాత్ర పోషించిన ఆ వ్యక్తే టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.  గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్‌గా జట్టుని వెనుక నుంచి విజయపథంలో నడిపాడు. ఇదేం జట్టురా బాబు.. పట్టుమని నాలుగు మ్యాచ్‌లైనా గెలుస్తారా వీళ్లు.. అని సందేహాలు వ్యక్తమైన జట్టుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిపి శెభాష్ కోచ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన తొలి ఇండియన్‌ కోచ్‌గా ఆశిష్ నెహ్రా నిలిచాడు. ఇదివరకు ఏ భారతీయ కోచ్‌ కూడా రికార్డ్‌ను  సాధించలేకపోయారు. ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ తిరుగులేని విజయం సాధించడంతో ఈ రికార్డు సొంతమైంది.


అంతేకాదు.. సరిగ్గా ఆరేళ్లక్రితం ఐపీఎల్ టోర్నీ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడిగా నెహ్రా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కోచ్‌గా, ఆటగాడి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన  రికీ పాంటింగ్, షేన్ వార్న్‌ వంటి క్రికెట్ దిగ్గజాల సరసన నెహ్రా చోటుదక్కించుకున్నాడు.


హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతోపాటు మెంటర్‌గా వ్యవహరించిన గ్యారీ క్రిస్టెన్ కూడా గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. క్రిస్టెన్ స్పందిస్తూ.. గుజరాత్ ప్రధాన కోచ్ నెహ్రా చాలా అద్భుతమైన ప్రణాళికలు కలిగినవాడు, అతడితో కలిసి పనిచేయడాన్ని చక్కగా ఆస్వాదించానని క్రిస్టెన్ చెప్పాడంటే ఆశిష్ నెహ్రా పాత్ర జట్టు విజయంలో ఎంత విలువైనదో చెప్పొచ్చు. ఉమ్మడిగా ప్రణాళికలు రచించేవాడని క్రిస్టెన్ వివరించాడు. గుజరాత్ బ్యాట్స్‌మెన్ మాథ్యూవేడ్ స్పందిస్తూ... గుజరాత్ టీంలో ఒక కుటుంబ తరహా వాతావరణం సృష్టించడంలో కోచ్ ఆశిష్ నెహ్రా విజయవంతమయ్యాడని ఒకానొక సమయంలో చెప్పిన విషయం విధితమే. 


అత్యధిక ఐపీఎల్‌ ట్రోఫీలు గెలుచుకున్న హెడ్‌ కోచ్‌లు వీరే..

1. స్టీఫెన్ ఫ్లేమింగ్(న్యూజిలాండ్) - 4 ట్రోఫీలు

2. జయవర్దనే(శ్రీలకం)- 3

3. ట్రెవోర్ బేలిస్(ఆస్ట్రేలియా)-2

4. ఆశిష్ నెహ్రా(ఇండియా)-1

5. టామ్ మూడీ(ఆస్ట్రేలియా)-1

6. రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)-1

7. జాన్ రైట్(న్యూజిలాండ్)-1

8. డారెన్ లేమ్యాన్(ఆస్ట్రేలియా)-1

9. షేర్ వార్న్(ఆస్ట్రేలియా)-1

Updated Date - 2022-05-30T20:19:26+05:30 IST