అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్‌

ABN , First Publish Date - 2021-04-16T10:25:01+05:30 IST

అతి పొడవైన వెంట్రుకలతో ప్రత్యేకత చాటుకున్న నిలాంషి పటేల్‌ ఆ వెంట్రుకలను కత్తిరించుకుంది. 12 ఏళ్ల పాటు అపురూపంగా

అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: అతి పొడవైన వెంట్రుకలతో ప్రత్యేకత చాటుకున్న నిలాంషి పటేల్‌ ఆ వెంట్రుకలను కత్తిరించుకుంది. 12 ఏళ్ల పాటు అపురూపంగా పెంచుకున్న 6 అడుగుల 6.7 అంగుళాల పొడవైన వెంట్రుకలతో ఈ టీనేజర్‌ ఇటీవల గిన్నిస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే, వెంట్రుకలను దానం చేయాలన్న తల్లి సూచన మేరకు తన వెంట్రుకలను కత్తిరించుకొన్న వీడియోను తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పెట్టింది. తన వెంట్రుకలను హాలీవుడ్‌లోని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు మ్యూజియానికి అందజేసినట్లు తెలిపింది. 

Updated Date - 2021-04-16T10:25:01+05:30 IST