మామిడి తాండ్రపైనా జీఎస్‌టీ బాదుడు

ABN , First Publish Date - 2022-08-05T06:02:43+05:30 IST

లేదు లేదంటూనే వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎ్‌సటీ భారం మోపుతోంది. తాజా మామిడి పండ్లు, కాయలు తప్ప అన్ని రకాల మామిడి ఉత్పత్తులపైనా

మామిడి తాండ్రపైనా జీఎస్‌టీ బాదుడు

పార్లర్‌ ఐస్‌క్రీం మరింత ప్రియం


న్యూఢిల్లీ: లేదు లేదంటూనే వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎ్‌సటీ భారం మోపుతోంది. తాజా మామిడి పండ్లు, కాయలు తప్ప అన్ని రకాల మామిడి ఉత్పత్తులపైనా 12 శాతం చొప్పు జీఎస్‌టీ విధించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) గురువారం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. దీంతో కుటీర పరిశ్రమగా చేసే మామిడి తాండ్ర, ఒరుగుల వంటి మామిడి ఉత్పత్తులపైనా 12 శాతం జీఎస్‌టీ పడనుంది. దీనికి తోడు ఐస్‌క్రీం పార్లర్లలో తినే ఐస్‌క్రీమ్‌పై విధించే జీఎ్‌సటీపైనా స్పష్టత ఇచ్చింది. ఈ ఐస్‌క్రీమ్‌లు 18% జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయని తెలిపింది. గత ఏడాది అక్టోబరు 6 నుంచే ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) సదుపాయంతో ఈ బాదుడు అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. పాత పన్ను బకాయిలను ఐస్‌క్రీమ్‌ పార్లర్లు ఐటీసీ లేకుండా పాత 5ు జీఎ్‌సటీతోనే చెల్లించవచ్చని పేర్కొంది. 

Updated Date - 2022-08-05T06:02:43+05:30 IST