ఆల్‌టైం రికార్డ్... ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్ళు...

ABN , First Publish Date - 2022-05-01T20:28:20+05:30 IST

కిందటి నెల(ఏప్రిల్, 2022)లో సేకరించిన స్థూల జీఎస్‌టీ రాబడి... దాని ఆల్‌టైం గరిష్టం(రూ. 1,67,540 కోట్లు)గా నమోదైంది.

ఆల్‌టైం రికార్డ్... ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్ళు...

హైదరాబాద్ : కిందటి నెల(ఏప్రిల్, 2022)లో సేకరించిన స్థూల  జీఎస్‌టీ రాబడి... దాని ఆల్‌టైం గరిష్టం(రూ. 1,67,540 కోట్లు)గా నమోదైంది. ఇది మార్చి 2022 లో జరిగిన రూ. 1,42,095 కోట్ల వసూళ్ళ తర్వాత... రూ. 25 వేల కోట్లు అధికం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే... రాబడులు 20 శాతం ఎక్కువ. ఇందులో కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్‌టీ) రూ. 33,159 కోట్లు, రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్‌జీఎస్‌టీ) రూ. 41,793 కోట్లు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(ఐజీఎస్‌టీ) రూ. 81,939 కోట్లు(రూ. 36,705 కోట్లతో కలిపి)  వసూలయ్యాయి. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించిన వివరాలివి. ప్రభుత్వం ఇప్పటికే ఐజీఎస్‌టీ  నుంచి సీజీఎస్‌టీకి రూ.33,423 కోట్లు, ఎస్‌టీఎస్‌టీకి  రూ. 26,962 కోట్లు చెల్లించిందని నివేదిక పేర్కొంది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత కిందటి నెల(ఏప్రిల్ 2022)లో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్‌టీకి రూ. 66,582 కోట్లు, ఎస్‌జీఎస్‌టీకి రూ. 68,755 కోట్లుగా ఉంది. స్థూల జీఎస్‌టీ వసూళ్లు తొలిసారిగా రూ. 1.5 లక్షల కోట్ల మార్కును దాటాయని పేర్కొంది. ఈ ఏడాది


 మార్చిలో ఉత్పత్తైన మొత్తం ఈ-వే బిల్లుల సంఖ్య 7.7 కోట్లు, ఫిబ్రవరిలో ఉత్పత్తి చేయబడిన 6.8 కోట్ల ఇ-వే బిల్లుల కంటే దాదాపు 13 శాతం ఎక్కువ. ఇది దేశంలో వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణ వేగంగా నడవడాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. ఆసక్తికరంగా, ఏప్రిల్ 2022 లో ఒకే రోజులో అత్యధికంగా పన్ను వసూలు కవడం కూడా జరిగింది. 20 ఏప్రిల్ 2022 న 9.58 లక్షల లావాదేవీల ద్వారా రూ. 57,847 కోట్ల వసూలు జరిగింది. దీనికి అదనంగా, 20 ఏప్రిల్ 2022న సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు దాదాపు రూ. 8 వేల కోట్లను  8 వేల లావాదేవీల నేపథ్యంలో చెల్లించినట్లు పీఐబీ నివేదిక వెల్లడించింది. జీఎస్‌టీఆర్-3బీలో దాదాపు 1.06 కోట్ల జీఎస్‌టీ రిటర్న్‌లు ఏప్రిల్ 2022 లో దాఖలయ్యాయి. వాటిలో 97 లక్షలు... ఈ ఏడాది  మార్చికి సంబంధించినవి. అలాగే... ఏప్రిల్‌లో దాఖలైన జీఎస్‌టీఆర్-1 లో 1.05 కోట్ల ఇన్‌వాయిస్‌లు కూడా జారీ అయ్యాయి. ఏప్రిల్ 2021 లో 78.3 శాతంతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో జీఎస్‌టీఆర్-3బీ  కోసం దాఖలు చేసే శాతం 84.7 గా ఉంది, ఏప్రిల్ 2021 లో జీఎస్‌టీఆర్-1 కోసం దాఖలు చేసే శాతం ఏప్రిల్ 2021 లో 73.9 శాతంతో పోలిస్తే 83.11 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

Updated Date - 2022-05-01T20:28:20+05:30 IST