ఈ ఏడాది వృద్ధి -9 శాతం : ఎస్‌ అండ్‌ పీ

ABN , First Publish Date - 2020-09-15T05:46:31+05:30 IST

భారత వృద్ధి రేటు ఈ ఏడాది -9 శాతం ఉండవచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ తాజాగా ప్రకటించింది.

ఈ ఏడాది వృద్ధి -9 శాతం : ఎస్‌ అండ్‌ పీ

న్యూఢిల్లీ : భారత వృద్ధి రేటు ఈ ఏడాది -9 శాతం ఉండవచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ తాజాగా ప్రకటించింది. గతంలో ప్రకటించిన -5 శాతాన్ని ఎగువకు సవరించింది. పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం వల్ల ప్రైవేటు వ్యయం, పెట్టుబడులు క్షీణించే ఆస్కారం ఉండడం ఇందుకు కారణమని తెలిపింది.

అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10 శాతం ఉండవచ్చని కూడా అంటోంది. వ్యవస్థీకృత రంగాల్లో రికవరీ ఆశించిన స్థాయి కన్నా తక్కువగా ఉన్నదని సంస్థ ఆసియా పసిఫిక్‌ విభాగం ఆర్థికవేత్త విశ్రుత్‌ రాణా అన్నారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధిరేటు -23.9 శాతానికి దిగజారిన విషయం విదితమే. 


Updated Date - 2020-09-15T05:46:31+05:30 IST