గవర్నర్, సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-08-31T09:33:16+05:30 IST
వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం పురోగతి దిశగా పయనిస్తున్న వేళ ఆ దారిలో ఉన్న విఘ్నాలను తొలగించాలని గణనాథుని ప్రార్థిస్తున్నానన్నారు. అలాగే.. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయకచవితి పండుగ మనకు నేర్పుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.