ఈ నగరాల్లో 5జీ పరీక్షకు గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2021-05-05T01:14:10+05:30 IST

‘5జీ’ ట్రయల్స్‌‌కు సంబంధించి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు... టెలికమ్యూనికేషన్ విభాగం అనుమతినిచ్చింది.

ఈ నగరాల్లో 5జీ పరీక్షకు గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ : ‘5జీ’ ట్రయల్స్‌‌కు సంబంధించి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు... టెలికమ్యూనికేషన్ విభాగం అనుమతినిచ్చింది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్, జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్‌టీఎన్‌ఎల్ సంస్థలు ఈ అనుమతులను పొందాయి. పరికరాల తయారీదారులు, టెక్నాలజీ ప్రొవైడర్లతో ఈ టెలకం సర్వీసు ప్రొవైడర్లకు భాగస్వామ్యముంది. ఎరిక్సన్, నోకియా, సామ్సంగ్ తోపాటు సీ ‌ట్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఈ జాబితాలో ఉన్నాయి.


కాగా5జీ ట్రయల్స్‌లో ‘హువావే’ పాల్గొనలేదు. మొత్తం దేశంలో 5 జీకి ప్రాధాన్యత పెరుగుతోన్న నేపధ్యంలోలో ఈ వార్త వెలువడింది. ప్రస్తుతం టెలికం సంస్థలు గత కొంతకాలంనుంచి 5జీ మీద దృష్టి పెడుతోన్న విషయం తెలిసిందే. రిలయన్స్ జియో సంస్థ స్వదేశీ 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో ఎయిర్‌టెల్ హైదరాబాద్  వాణిజ్య నెట్‌వర్క్‌ను విజయవంతంగా 5జీ పరీక్షను ఆమోదించింది. 


Updated Date - 2021-05-05T01:14:10+05:30 IST