‘గ్రేటర్‌’లో తగ్గిన ఓటర్లు

ABN , First Publish Date - 2020-11-01T12:08:56+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ముమ్మరమైంది. జనవరి 10, 2020 కటాఫ్‌ తేదీతో, ఫిబ్రవరిలో ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలని శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకటించింది.

‘గ్రేటర్‌’లో తగ్గిన ఓటర్లు

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ముమ్మరమైంది. జనవరి 10, 2020 కటాఫ్‌ తేదీతో, ఫిబ్రవరిలో ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలని శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకటించింది. 7వ తేదీన ముసాయిదా జాబితాను సర్కిల్‌, జోనల్‌, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వాటి పరిశీలన పూర్తిచేసి తుది జాబితాని ఈ నెల 13న ప్రచురిస్తారు. ఈ లోపు కేంద్ర, సర్కిల్‌ కార్యాలయాల స్థాయిలో ముసాయిదా జాబితాపై అభిప్రాయాలు తీసుకునేందుకు రాజకీయ పార్టీలతో కమిషనర్‌, డీసీ సమావేశమవుతారు. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 67 వేలకు పైగా ఓటర్లు తగ్గారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటనకు వారం ముందు వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అనుబంధ ఓటరు జాబితాలో చేరుస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు.

Updated Date - 2020-11-01T12:08:56+05:30 IST