‘పరిమితం’.. ఇక మన మంత్రం

ABN , First Publish Date - 2020-05-22T10:10:43+05:30 IST

కరోనా అనంతరం మన జీవనశైలిలో పెనుమార్పులు వస్తాయని భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అభిప్రాయపడ్డాడు. విలాసాల కోసం వెంపర్లాడే రోజులు పోతాయని చెప్పాడు. మొత్తంగా పరిమిత వనరులతో జీవించాల్సి రావడం

‘పరిమితం’.. ఇక మన మంత్రం

న్యూఢిల్లీ: కరోనా అనంతరం మన జీవనశైలిలో పెనుమార్పులు వస్తాయని భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అభిప్రాయపడ్డాడు. విలాసాల కోసం వెంపర్లాడే రోజులు పోతాయని చెప్పాడు. మొత్తంగా పరిమిత వనరులతో జీవించాల్సి రావడం ఒక్కటే వాస్తవమన్నాడు. లాక్‌డౌన్‌ కారణగా విషీ జర్మనీలోనే గత మూడు నెలలుగా చిక్కుకు పోయాడు. ఈ విరామంలో ఎన్నో విషయాలను లోతుగా పరికించే అవకాశం దక్కిందని ఆనంద్‌ చెప్పాడు. ‘నా ఆలోచనంతా కుటుంబం చుట్టూనే. వాళ్లను కలుసు కోవాలి. ఆధునిక జీవనం అంతా వినిమయం చుట్టూనే తిరుగుతోంది. దీనికి బానిసలయ్యామనే విషయం బోధపడింద’ని విషీ చెప్పాడు. నిత్యావసరాలను సంపాదించడం ఎంతో కష్టమో అర్థమైన పరిస్థితుల్లో వాటిని ఎంతో పొదుపుగా వాడుకోవడానికి తన భార్య, కుమారుడు ప్రయత్నించడం గుర్తించానన్నాడు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి బ్రేక్‌ తీసుకుని.. ‘నాణ్యమైన జీవితం’ అంటే ఏంటో గ్రహించే అవకాశం దక్కిందన్నాడు.

Updated Date - 2020-05-22T10:10:43+05:30 IST