Advertisement
Advertisement
Abn logo
Advertisement

మండపేటలో ధాన్యం వ్యాపారి కిడ్నాప్

కాకినాడ: మండపేటలో ధాన్యం వ్యాపారి దూలం చక్రవర్తి కిడ్నాప్ అయ్యాడు. కాకినాడ సర్పవరానికి చెందిన పుల్ల శ్రీరాములుకి 70 లక్షలు విలువైన ధాన్యాన్ని  చక్రవర్తి అమ్మాడు. ఆ డబ్బుల విషయమై శ్రీరాములుకి చక్రవర్తి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. మంగళవారం రాత్రి సర్పవరం నుంచి శ్రీరాములు, కొంతమంది అనుచరులతో కారులో వచ్చి ప్రాపర్టీ రాసిస్తానని నమ్మించి చక్రవర్తిని కారులో తీసుకు వెళ్లాడు. ఈరోజు ఉదయం భార్యకు ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేసినట్టు చక్రవర్తి చెప్పాడు. దీంతో మండపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో చక్రవర్తి భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, రెండు బృందాలుగా చక్రవర్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Advertisement
Advertisement