Abn logo
Mar 2 2021 @ 10:17AM

నైట్రోజన్‌ వాయువు పీల్చి బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ ఆత్మహత్య

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : మానసిక ఆందోళనకు గురవుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామకృష్ణ(25) బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా అతడు తనను ఎవరో వెంబడిస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని బంధువులతో అంటుండేవాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. స్నేహితుడిని కలిసి వస్తానని ఆదివారం హైదరాబాద్‌ వచ్చిన శివరామకృష్ణ మసాబ్‌ట్యాంక్‌లో హైదరాబాద్‌ హైట్స్‌ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం ఉదయం గది తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బంది సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా అతడు చనిపోయి ఉన్నాడు. నైట్రోజన్‌ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement