ఎన్‌ఆర్‌ఐల జీపీఏ ఆధారంగా రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2021-05-07T09:26:53+05:30 IST

ప్రవాస భారతీయులు తమ వ్యవసాయ భూములపై ఎవరికైనా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) ఇస్తే, వాటి ఆధారంగా విక్రయాలు, గిఫ్ట్‌ డీడ్‌లు

ఎన్‌ఆర్‌ఐల జీపీఏ ఆధారంగా రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రవాస భారతీయులు తమ వ్యవసాయ భూములపై ఎవరికైనా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) ఇస్తే, వాటి ఆధారంగా విక్రయాలు, గిఫ్ట్‌ డీడ్‌లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ధరణి వెబ్‌సైట్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది.  దీనికోసం ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌లో లాగిన్‌ అయి వివరాలు నమోదు చేయాలి. అమ్మకం లేదా గిఫ్ట్‌ రెండిటిలో దేనిని ఎంచుకుంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమాచారం మొత్తం నింపిన తరువాత స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన  రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తహసీల్దార్‌ పూర్తిచేస్తారు. 

Updated Date - 2021-05-07T09:26:53+05:30 IST