తెలంగాణలో ఇక బార్‌లు తెరుచుకోనున్నాయ్..

ABN , First Publish Date - 2020-09-25T23:28:36+05:30 IST

రాష్ట్రంలో బార్‌లు, క్లబ్‌లు, టూరిజం బార్‌లు తెరుచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపధ్యంలో గత మార్చినెలలో వైన్‌షాపులతో పాటు బార్‌లు, క్లబ్‌లను కూడామూసి వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో ఇక బార్‌లు తెరుచుకోనున్నాయ్..

హైదరాబాద్‌: తెలంగాణలో బార్‌లు, క్లబ్‌లు, టూరిజం బార్‌లు తెరుచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపధ్యంలో గత మార్చినెలలో వైన్‌షాపులతో పాటు బార్‌లు, క్లబ్‌లను కూడామూసి వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరిగి ఆరు నెలల తర్వాత తాజాగా బార్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలకు లోబడి వీటిని అనుమతించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే బార్‌లు,క్లబ్‌లు,టూరిజం బార్‌లకు నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. బార్‌లు, క్లబ్‌లలో ప్రవేశ ద్వారం వద్దనే కస్టమర్లకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించాలి. లోపలికి వెళ్లేప్పుడు తప్పని సరిగా క్యూపద్దతిని పాటించాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. 


పార్కింగ్‌ లాట్‌లలో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రతి టేబుల్‌ వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి. బార్‌ నిర్వాహకులు, సిబ్బంది తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలి. బార్లలో, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర మూగడం, మ్యూజిక్‌ కార్యక్రమాలు, డాన్స్‌ ఫ్లోర్‌లు ఏర్పాటు చేయడం నిషేధం. కస్టమర్లు వచ్చేముందు ప్రతి బార్‌లోపల, బయటా ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేయాల్సి వుంటుంది. బార్‌లలో సరైన వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా వైన్‌షాపుల వద్ద నిర్వహించే పర్మిట్‌ రూమ్‌లకు తదుపరి ఆనుమతి ఇచ్చే వరకూ మూసే ఉంచాలని ప్రభుత్వం వెల్లడించింది. 

Updated Date - 2020-09-25T23:28:36+05:30 IST