గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదు: ఉత్తమ్

ABN , First Publish Date - 2022-03-06T21:05:33+05:30 IST

గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదు: ఉత్తమ్

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సమవేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎల్సీ సమావేశమైంది. ఈ సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. దళిత బంధు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ ఉత్తమ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. కృష్ణానదిపై ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీస్ అక్రమాలు పెరిగిపోయాయని, వీటిపై సభలో నిలదీస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.



Updated Date - 2022-03-06T21:05:33+05:30 IST