గవర్నర్‌.. ఆచితూచి!

ABN , First Publish Date - 2021-01-24T07:58:24+05:30 IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గమనిస్తున్నారు.

గవర్నర్‌.. ఆచితూచి!

  • ఎన్నికల ‘పంచాయితీ’పై నిశిత పరిశీలన
  • ఎలక్షన్లకు సుప్రీం సరేనంటే ఇబ్బంది లేదు
  • కోర్టు ఎన్నికలొద్దని చెప్పినా ఎస్‌ఈసీ పాటిస్తుంది
  • విచారణ ఆలస్యమైతే మాత్రం గవర్నర్‌ జోక్యం తప్పదు!
  • హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందే
  • అన్ని కోణాల్లో విశ్వభూషణ్‌ పరిశీలన!


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గమనిస్తున్నారు. అయితే వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ముందుకు తీసుకెళ్లడం, నోటిఫికేషన్‌ ఇవ్వడం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావలసి ఉందని.. ఇప్పుడైనా కచ్చితంగా పెట్టి తీరాల్సిన విధి తనపై ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చెబుతోంది. రాష్ట్రప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదు. ఉన్నతాధికారులు సైతం ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు ఎస్‌ఈసీ పిలిచినా రావడం లేదు. ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్‌ శాఖ ససేమిరా అంటోంది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా సహకరించబోమని అంటున్నారు. ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నరే జోక్యం చేసుకోవాలని ఒకపక్క ఎస్‌ఈసీ.. మరోపక్క విపక్షాలు కోరుతున్నాయి. రా జ్యాంగంలోని 243 కే(3) అధికరణ ప్రకారం ఎస్‌ఈసీకి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని అంటున్నారు. మరోవైపు ఎ న్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆయనకు వివరిస్తున్నా రు. ప్రభుత్వమూ తన వాదన పంపిస్తోంది. ఉద్యోగ సం ఘాల నేతలు సైతం గవర్నర్‌ను కలిసి.. వ్యాక్సినేషన్‌ పూ ర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలని కోరారు.


ఈ నేపథ్యంలో రాజ్యాం గ ఉల్లంఘన జరగకుండా ఏం చేయాలి.. ఎవరి వాదనల్లో వాస్తవం ఎంత.. అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వ స్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశాన్ని మదిస్తున్నా.. ఇప్పటికిప్పుడే నిర్ణ యం తీసుకోవడం కాకుండా వేచి చూడాలని భావిస్తున్నారు. ఈలోపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేస్తే ఎన్నికల నిర్వహణపై  స్పష్టత వస్తుందన్న అభిప్రాయం రాజ్‌భవన్‌ వర్గాల్లో ఉంది. సుప్రీంకోర్టు గనుక పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఇక ప్రభుత్వానికి, ఉద్యోగులకు వేరే అవకాశం ఉండదని భా విస్తున్నారు. దానికి భిన్నంగా తీర్పు వస్తే.. ఎస్‌ఈసీ దాని ప్ర కారమే వెళ్తుందంటున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించాక కూడా ధిక్కార ధోరణులు ఉంటే.. అప్పుడు గవర్నర్‌ జోక్యం చేసుకుంటారని సమాచారం. ఒకవేళ విచారణ ఆలస్యమైతే.. ఇప్పటికే ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసినందున.. హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు తప్పక జరపాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఏం చేయాలన్నదానిపైనా గవర్నర్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-01-24T07:58:24+05:30 IST