కలుషిత నీటి శుద్ధి కోసం ఎస్‌టీపీల ఏర్పాటుకు చర్యలు..

ABN , First Publish Date - 2020-08-05T20:54:26+05:30 IST

అమరావతి: రాష్ట్రంలో నదుల్లో కలుస్తున్న కలుషిత నీటి శుద్ధి కోసం సివెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్(ఎస్‌టీపీ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

కలుషిత నీటి శుద్ధి కోసం ఎస్‌టీపీల ఏర్పాటుకు చర్యలు..

అమరావతి: రాష్ట్రంలో నదుల్లో కలుస్తున్న కలుషిత నీటి శుద్ధి కోసం సివెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్(ఎస్‌టీపీ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పురపాలక శాఖ కార్యదర్శిని ఎస్‌టీపీ ఏర్పాటుకు నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాలలోని ఐదు నదులలో కలుషిత నీరు చేరుతుందని గతంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 100 శాతం కలుషిత నీటిని శుద్ధి చేసే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌టీపీ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Updated Date - 2020-08-05T20:54:26+05:30 IST