యాసంగిలో వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: కేసీఆర్

ABN , First Publish Date - 2021-03-30T00:03:48+05:30 IST

యాసంగిలో వరి ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల

యాసంగిలో వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: కేసీఆర్

హైదరాబాద్‌: యాసంగిలో వరి ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు రూ.20 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం కలెక్టర్లతో అత్యవసర  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్‌ సోమేష్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి నిరంజర్‌రెడ్డికి కేసీఆర్ సూచించారు.

Updated Date - 2021-03-30T00:03:48+05:30 IST