ప్రభుత్వ లేఅవుట్లపై మధ్య తరగతి ఆసక్తి

ABN , First Publish Date - 2021-04-11T09:17:45+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో ని మధ్య తరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చే యదలచిన ఎంఐజీ లేఅవుట్ల(జగనన్న స్మార్ట్‌ టౌన్లు)కు సా నుకూల స్పందన కనిపిస్తోంది.

ప్రభుత్వ లేఅవుట్లపై మధ్య తరగతి ఆసక్తి

సర్వేలో ఓకే చెప్పిన 2.32 లక్షల మంది


అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో ని మధ్య తరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చే యదలచిన ఎంఐజీ లేఅవుట్ల(జగనన్న స్మార్ట్‌ టౌన్లు)కు సా నుకూల స్పందన కనిపిస్తోంది. ఈ లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటివరకూ రాష్ట్రంలోని 2,32,369 మంది తమ ఆసక్తిని ‘డిమాండ్‌ అంచ నా సర్వే’లో తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ నెల 20 వరకు ఈ సర్వే కొనసాగే అవకాశాలున్నాయి.


మరికొన్ని పట్టణాల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నందున ఆశావహుల సంఖ్య మరింత పె రుగుతుందని పురపాలక శాఖ భావిస్తోంది. ప్రైవేట్‌ వ్యక్తు లు, స్థిరాస్తి సంస్థలు వేసే అనధికారిక లేఅవుట్లలో స్థలాలు కొని, ఆ తర్వాత ఇబ్బందులు పడటం ఎందుకన్న అభిప్రాయంతోపాటు అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు డీటీసీపీ కార్యాలయం తీసుకున్న నిర్ణయాలు ఈ ఎంఐజీ లేఅవుట్లకు మంచి స్పందన లభించడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అధునాతన సదుపాయాలతో, న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేని ఇళ్ల స్థలాలను ఈ లేఅవుట్లలో అభివృద్ధి పరచి, పట్టణాలు, నగరాల్లోని మ ధ్య తరగతి కుటుంబాలకు లాభనష్టాల్లేని ప్రాతిపదికన విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మూడు పరిమాణాల్లో (150, 200, 240 చ.గ.) ప్లాట్లతో ఉండే ఈ లేఅవుట్లపై ప్రజల్లో ఏమాత్రం ఆసక్తి ఉందో తెలుసుకుని, తదనుగుణంగా ముందుకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో గత 10 రోజులుగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ‘డిమాండ్‌ అసె్‌సమెంట్‌ సర్వే’ చేస్తున్నారు.  


మూడు సైజులకూ మొగ్గు

ఇప్పటి వరకూ నిర్వహించిన సర్వే ద్వారా రాష్ట్రంలోని 2,32,369 మంది ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. లేఅవుట్లలో మూడు సైజుల ప్లాట్లు ఉండగా.. ఈ మూడింటి పట్ల ఆసక్తిచూపిన వారి సంఖ్య దాదాపు సరిసమానంగా ఉంది. 150 చదరపు గజాల స్థలాలకు 76,018 మంది, 200 చ.గ.లకు 77,247 మంది, 240 చ.గ.ల పట్ల 79,104 మంది ఆసక్తి చూపారు. 

Updated Date - 2021-04-11T09:17:45+05:30 IST