గుస్సాడి కనకరాజుకు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-18T08:03:16+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలంలోని మార్లవాయికి చెందిన ఆదివాసీ గుస్సాడి కనకరాజుకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందింది. గుస్సాడీ కళాకారుడు కనకరాజును కేంద్రం ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.

గుస్సాడి కనకరాజుకు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం

జైనూరు, అక్టోబరు 17: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలంలోని మార్లవాయికి చెందిన ఆదివాసీ గుస్సాడి కనకరాజుకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందింది. గుస్సాడీ కళాకారుడు కనకరాజును కేంద్రం ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేయాల్సి ఉంది. కొవిడ్‌ వల్ల అవార్డు పత్రాన్ని కనకరాజు అందుకోలేకపోయారు. దీంతో నవంబరు 9న ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రపతి భవనం నుంచి ఆదివారం లేఖ అందింది. ఆ రోజు ఆయనకు అవార్డు పత్రాన్ని అందిస్తారు.

Updated Date - 2021-10-18T08:03:16+05:30 IST