దక్షిణ కొరియా బాటలోనే యూకే.. గూగుల్ సహాయంతో..

ABN , First Publish Date - 2020-04-05T06:23:44+05:30 IST

సూక్ష్మజీవి కొవిడ్-19 కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లలకే పరిమితం కావాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి అనేక దేశాల్లో

దక్షిణ కొరియా బాటలోనే యూకే.. గూగుల్ సహాయంతో..

లండన్: సూక్ష్మజీవి కొవిడ్-19 కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లలకే పరిమితం కావాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి అనేక దేశాల్లో ఆగడం లేదు. రోజురోజుకూ కరోనా బాధితులు, మరణాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. ముఖ్యంగా అమెరికాలో, యూరప్ దేశాల్లో పరిస్థితి చేయి దాటిపోతోంది. కరోనా పుట్టుకొచ్చిన చైనాలో ప్రస్తుతం లాక్‌డౌన్ కూడా ఎత్తివేశారు. అక్కడి ప్రభుత్వం కరోనాను నియంత్రించడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. మరోపక్క చైనా పక్కనే ఉన్న దక్షణ కొరియా సైతం కరోనాను చాకచక్యంగా అదుపులోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు దక్షిణ కొరియా ఫార్ములానే అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రభుత్వం జీపీఎస్ ద్వారా కరోనా బాధితులను, వారు తిరిగిన ప్రదేశాలను వెంటనే గుర్తించగలిగింది. ఈ సమాచారంతో ఆయా ప్రాంతాల్లో వేరొకరు తిరగకుండా చర్యలు తీసుకోగలిగింది. 


తాజాగా యూకే ప్రభుత్వం కూడా ఇదే రూట్‌ను ఎంచుకుంది. ఇందులో భాగంగానే గూగుల్ సంస్థతో కలిసి పనిచేస్తోంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా కరోనా బాధితులు ఎక్కడెక్కడికి వెళ్లింది, ఎవరితో కాంటాక్ట్ అయింది తెలుసుకునే పనిలో పడింది. యూనివర్శిటి ఆఫ్ సౌత్‌ఆంప్టన్ విద్యావేత్తలతో కలిసి గూగుల్ ప్రతినిధులు లొకేషన్ డేటాను సేకరిస్తున్నారు. మరోపక్క సౌత్‌ఆంప్టన్ పరిశోధకులు వొడాఫోన్ సంస్థతో కూడా కలిసి పనిచేస్తున్నారు. కరోనా ఎలా వ్యాప్తి చెందుతోంది అని తెలుసుకోడానికి తాము సౌత్‌ఆంప్టన్ పరిశోధకులతో కలిసి పనిచేస్తున్నట్టు వొడాఫోన్ సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు. యూకేలో అతిపెద్ద టెలికామ్ కంపెనీలైన బ్రిటిష్ టెలికామ్, టెలిఫోనికా కంపెనీలు కూడా ఇప్పటికే లొకేషన్ డేటాను ప్రభుత్వానికి అందించాయి. కాగా.. గత కొద్ది రోజుల నుంచి అమెరికా, యూకే, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, స్పెయిన్, ఇరాన్, తైవాన్ తదితర దేశాలన్నీ మొబైల్ లొకేషన్ డేటా ద్వారానే కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Updated Date - 2020-04-05T06:23:44+05:30 IST