Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌కు క్రిప్టో కంపెనీలు గుడ్‌బై?

  • యూఏఈ లేదా సింగపూర్‌కు వలస!!
  • ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను నిషేధించనున్నారనే అంచనాలే కారణం


భారత ప్రభుత్వం ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను నిషేధించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాక ఈ విషయంపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో క్రిప్టో ఎక్స్ఛేంజీలతో పా టు బ్లాక్‌ చెయిన్‌, నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎ్‌ఫటీ) కంపెనీల భవితవ్యం కూడా అనిశ్చితిలో పడింది. దీంతో చాలా క్రిప్టో ఎక్స్ఛేంజీలు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) లేదా సింగపూర్‌ తదితర దేశాలకు మకాం మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని నిర్ణయిస్తే, తన వ్యాపారాన్ని భారత్‌ నుంచి తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని ఎథేరియం పుష్‌ నోటిఫికేషన్‌ సర్వీ్‌స (ఈఎన్‌పీఎ్‌స) వ్యవస్థాపకుడు హర్ష్‌ రజత్‌ అంటున్నారు. 


దేశంలో 15 క్రిప్టో ఎక్స్ఛేంజీలు 

ప్రస్తుతం దేశంలో 15 క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ ఎక్స్ఛేంజీలున్నాయి. వీటి ద్వారా 10 కోట్లకు పైగా మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టారు. 2020 ఏప్రిల్‌లో 90 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారతీయుల క్రిప్టో పెట్టుబడులు.. ప్రస్తుతం 1,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.75,000 కోట్లు) దాటాయని క్రెబాకో తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. 


 50,000కు పైగా ఉద్యోగాలపై ప్రభావం

దేశీయ క్రిప్టో కంపెనీలు, స్టార్ట ప్‌ల్లో 50,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం క్రిప్టోలను నిషేధిస్తే, ఈ రంగ కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోయేందుకే మొగ్గుచూపవచ్చని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. అదే గనుక జరిగితే, ఈ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మనీలాండరింగ్‌, మానవ అక్రమ రవాణా, ఆయుధాల కొనుగోలు, మాదక ద్రవ్యాల రవాణా వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు క్రిప్టోలు ఉపయోగపడుతున్నప్పటికీ, ఈ రంగం ప్రస్తుతం దేశంలో యాభై వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాదు, 21వ శతాబ్దంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా మార్చే సత్తా ఉన్న రంగమిద’’ని నాన్స్‌బ్లాక్స్‌ బ్లాక్‌ చెయిన్‌ స్టూడియో వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా అన్నారు.  


కంపెనీల్లోకి భారీగా పెట్టుబడులు 

వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ డేటా ప్రకారం.. ఈ ఏడాది క్రిప్టో, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత స్టార్ట్‌పల్లోకి పెట్టుబడులు 20 రెట్లు పెరిగాయి. గత ఏడాదిలో 5 స్టార్ట్‌పలు 2.5 కోట్ల డాలర్ల మేర నిధులను ఆకర్షించగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24 కంపెనీలు 50.2 కోట్ల డాలర్ల పెట్టుబడులను సేకరించాయి. ట్రాక్‌ఎక్స్‌ఎన్‌ ప్రకారం.. 2011 నుంచి ఇప్పటివరకు క్రిప్టో కరెన్సీల రంగంలో 376 కంపెనీలు పుట్టుకువచ్చాయి. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో 711 స్టార్ట్‌పలు, ఎన్‌ఎ్‌ఫటీ విభాగంలో మరో 12 స్టార్ట్‌పలు ఏర్పాటయ్యాయి. 

Advertisement
Advertisement