ABN దెబ్బకి దిగొచ్చిన జగన్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2021-11-13T22:31:46+05:30 IST

మొన్న విశాఖ, నిన్న కాకినాడు, నేడు ఎస్ఎస్బీఎన్ అనంతపురం కాలేజీల్లో తాము చదవుకుంటున్న..

ABN దెబ్బకి దిగొచ్చిన జగన్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

అమరావతి: మొన్న విశాఖ, నిన్న కాకినాడ, నేడు అనంతపురం ఎస్ఎస్బీఎన్ కాలేజీలో తాము చదవుకుంటున్న విద్యాసంస్థలు మూసివేయడానికి ప్రైవేటు యాజమాన్యంలోకి మార్చడానికి అంగీకరించని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ వస్తుందని, అమ్మఒడి వస్తుందని ప్రభుత్వం చెప్పినా విద్యార్థులు తలొగ్గలేదు.


స్కూళ్లు, కాలేజీల ముందు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమకు అమ్మఒడి కాదు, మంచి బడి కావాలని నినదించారు. ఖాకీల లాఠీలను, దెబ్బలను లెక్క చేయకుండా ఉద్యమం చేశారు. జగన్ తప్పుడు నిర్ణయాలపై విద్యార్థులకు అండగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గళమెత్తింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగటంతో వైసీపీ ప్రభుత్వం తలొగ్గింది



Updated Date - 2021-11-13T22:31:46+05:30 IST