ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకటి కాదు రెండు!

ABN , First Publish Date - 2021-08-18T08:58:24+05:30 IST

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం ..

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకటి కాదు రెండు!

న్యూఢిల్లీ: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) రెండు తీపికబుర్లు చెప్పింది. ఈ మేరకు బీసీసీఐ ప్రత్యేంకంగా ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ కారణంగా వచ్చేనెల 19 నుంచి యూఏఈలో జరగబోతున్న ఐపీఎల్ సెంకండ్ షెడ్యూల్‌‌లో మైదానాలకు ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీనికి యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. అలాగే వచ్చే ఏడాది.. అంటే 2022 ఐపీఎల్‌లో ప్రేక్షకులను మరింత మజా పెంచేందుకు 8 జట్లకు బదులు 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ చేసింది.


కాగా.. ఐపీఎల్ యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన సమయంలోనే స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతిస్తారా..? లేదా అనే విషయంపై పెద్ద చర్చ నడిచింది. అయితే దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. దీంతో యూఏఈ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాషిర్ ఉస్మాన్.. అటు యూఏఈ ప్రభుత్వంతోనూ, ఇటు బీసీసీఐతోనూ మాట్లాడాతమని అప్పట్లో ప్రకటించారు. ఇక తాజాగా ఈ చర్చలు ఫలించడంతో.. 60శాతం ప్రేక్షకులను అనుమతించుకునేందుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి కూడా అభిమానులకు బీసీసీఐ ఓ తీపికబరు అందించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఐపీఎల్-2022 గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది టోర్నీ ప్రేక్షకులకు మరింత మజా పంచనుందన్నారు. ఎప్పటిలా 8 జట్లతో కాకుండా.. ఈ సారి 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ జట్లు కొత్తగా చేరబోతున్నాయనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టారు. 

Updated Date - 2021-08-18T08:58:24+05:30 IST