గుడ్‌న్యూస్ చెప్పిన Kuwait.. ఆ రెండు రంగాల్లో జాబ్ చేస్తున్న వలసదారులకు..

ABN , First Publish Date - 2021-09-16T21:19:06+05:30 IST

కరోనా ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో గల్ఫ్ దేశం కువైత్ విదేశీయుల రాకపై ఉన్న నిషేధాన్ని ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే.

గుడ్‌న్యూస్ చెప్పిన Kuwait.. ఆ రెండు రంగాల్లో జాబ్ చేస్తున్న వలసదారులకు..

కువైత్ సిటీ: కరోనా ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో గల్ఫ్ దేశం కువైత్ విదేశీయుల రాకపై ఉన్న నిషేధాన్ని ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వలసదారులకు తిరిగి వచ్చేందుకు కువైత్ అనుమతి ఇచ్చింది. అటు విజిట్ వీసాల జారీని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా కువైత్ ప్రభుత్వం.. ఆరోగ్య, విద్యా రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సెక్టార్లలో పనిచేస్తున్న వలసదారు ఉద్యోగులను తమపై ఆధారపడి ఉన్న వారిని(భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు) విజిట్ వీసాపై కువైత్ తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. 


అయితే, అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన ప్రత్యేక నిబంధనలకు లోబడి మాత్రమే ప్రవాసుల కుటుంబ సభ్యులకు విజిట్ వీసాపై కువైత్ వచ్చేందుకు వీలు ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా విజిటింగ్ వీసాపై కువైత్ వచ్చిన డిపెండెంట్‌ల వీసాలను ఆ తర్వాత డిపెండెంట్ వీసాగా మారుస్తామని తెలిపారు. ఇది కూడా ప్రవాసులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇక విజిటింగ్ వీసాపై ఉన్న నిబంధనల తొలగింపుతో ముఖ్యంగా కువైత్‌లో అధిక సంఖ్యలో పనిచేస్తున్న కేరళకు చెందిన వేలాది మంది ప్రవాసులకు భారీ లబ్ధి చేకూరనుంది.


ఇవి కూడా చదవండి..

రికార్డు స్థాయిలో Kuwait కు గుడ్ బై చెప్పిన వలసదారులు.. ఏడాదిన్నరలో..

Kuwaitలో ఇక జైల్ ఫ్రమ్ హోమ్.. అమల్లోకి సరికొత్త నిబంధన.. వాళ్లందరికీ బెన్‌ఫిట్.. కండిషన్స్ ఏంటంటే..


కువైత్ నిర్ణయంతో లాభాపడేది వీరే..

ఆరోగ్య, విద్యా రంగాల్లో పనిచేస్తున్న మెడికల్ సిబ్బంది భాగస్వాములు, పిల్లలతో పాటు నేషనల్ గార్డ్, నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ సెక్టార్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా ఫ్యామిలీ ఎంట్రీ వీసాలకు అర్హులు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సుల 16 ఏళ్ల లోపు పిల్లలు ఫ్యామిలీ వీసాలపై కువైత్‌కు వెళ్లొచ్చు. వైద్యులు, నర్సుల భర్తలు కూడా టూరిస్ట్ వీసాలపై కువైత్‌ వెళ్లేందుకు అర్హులు. అయితే, వీరు ఆ తర్వాత ఫ్యామిలీ వీసాలకు దరఖాస్తు చేయమని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. పారామెడికల్ స్టాఫ్‌కు చెందిన భాగస్వాములు, పిల్లలు సైతం టూరిస్ట్ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారి భార్యలు, పిల్లలు విజిట్ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే తమ ఇక్మా(రెసిడెన్సీ పర్మిట్)ను మార్చబోమని అఫిడవిట్ ఇవ్వాలి. స్కూల్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, టీచర్స్, స్పెషలిస్టులు కూడా అక్కడి నిబంధనలకు లోబడి తమ 16 ఏళ్ల లోపు పిల్లలను కువైత్‌కు రప్పించుకోవచ్చు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారు తమ భార్యలను, పిల్లలను ఉపాధి ఆధారిత వీసాపై(ఎంప్లాయిమెంట్ వీసా) కువైత్ తీసుకెళ్లవచ్చు. రెసిడెన్సీ పర్మిట్ లేనివారికి కంపెనీ పేరుపై కమర్షియల్ విజిట్ వీసాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ, వీరు తప్పకుండా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ విషయమై ఫ్యామిలీ వీసాకు మారే సమయంలో అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-09-16T21:19:06+05:30 IST