కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

ABN , First Publish Date - 2021-09-30T01:19:51+05:30 IST

గులాబ్‌ తుఫాను ప్రభావంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

మహదేవపూర్‌: గులాబ్‌ తుఫాను ప్రభావంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి 12.6 మీటర్ల ఎత్తులో  ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో కాళేశ్వరంలోని పుష్కరఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. వరద ఉధృతి తగ్గేంత వరకు ఎవరూ గోదావరి వైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు.


వరద ప్రభావంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. అన్నారం బ్యారేజీలోకి 7.32లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా 66గేట్లకు 62గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధామనమైన మేడిగడ్డ బ్యారేజీలోకి 10.34లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫో చేరుతుండగా బ్యారేజీ 85గేట్లకు 79గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలో 3.31 టీఎంసీలు, మేడిగడ్డ బ్యారేజీలో 9.39 టీఎంసీల నీరు నిల్వ ఉండగా మేడిగడ్డ వద్ద నీటి గోదావరి 9.6 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.

Updated Date - 2021-09-30T01:19:51+05:30 IST