Abn logo
Apr 18 2021 @ 00:12AM

పబ్లిక్‌ ఇష్యూకు గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌

న్యూఢిల్లీ: గ్లెన్‌మార్క్‌ ఫార్మాసుటికల్స్‌ అనుబంఽధ సంస్థ గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌.. పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు (డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్సెక్టస్‌, డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.1,160 కోట్ల మొత్తానికి కొత్త షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అదే విధంగా రూ.2 ముఖ విలువ కలిగిన 73,05,245 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించనుంది.

Advertisement
Advertisement
Advertisement