Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 13 Oct 2021 07:31:38 IST

Pune: బాలిక ప్రేమించడం లేదనే కోపంతో యువకుడు ఏం చేశాడంటే...

twitter-iconwatsapp-iconfb-icon
Pune: బాలిక ప్రేమించడం లేదనే కోపంతో యువకుడు ఏం చేశాడంటే...

పూణే (మహారాష్ట్ర): తనను ప్రేమించలేదనే కోపంతో తన సమీప బంధువుల అమ్మాయిని వీధిలోనే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది.పూణేలోని బీబేవాడి ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల ఓ బాలిక తన స్నేహితురాళ్లతో కలిసి మంగళవారం సాయంత్రం కబడ్డీ ప్రాక్టీసు నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా శుభమ్ భగవత్ అనే 22 ఏళ్ల యువకుడు మరో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి మోటారు బైక్ పై వచ్చి కత్తితో పొడిచాడు. తన స్నేహితులతో కలిసి పదునైన కత్తులతో బాలిక గొంతు, శరీరంలోని ఇతర భాగాలపై పలు సార్లు పొడిచి చంపాడు. తీవ్రగాయాల పాలైన బాలిక సంఘటన స్థలంలోనే మరణించిందని పూణే పోలీసు అధికారి సునీల్ జవారె చెప్పారు. 

బాలికను హతమార్చాక ముగ్గురు నిందితులు పారిపోయారు.ప్రధాన నిందితుడైన భగవత్ బాలికకు దూరపు బంధువు అని, బాలిక ఇంట్లోనే ఉంటున్నాడని పోలీసులు చెప్పారు. బాలికను ప్రేమిస్తున్నందున భగవత్ ను ఇల్లు వదిలి వెళ్లమని అతని తల్లిదండ్రులు కోరారు. బాలికను ఏకపక్షంగా ప్రేమిస్తున్న భగవత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.నిందితుల్లో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారిణి నమ్రతాపాటిల్ చెప్పారు. నిందితుల వద్ద నుంచి బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. బాలిక హత్యోదంతం పూణేలో సంచలనం సృష్టించడంతో, ఈ కేసులో తక్షణం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోలీసులను ఆదేశించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.