జ్యోతికి ‘సూపర్‌’ ఆఫర్‌

ABN , First Publish Date - 2020-05-29T09:09:06+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని 1200 కిలో మీటర్ల దూరం ప్రయాణించిన బిహార్‌ సాహస బాలిక జ్యోతి కుమారికి...

జ్యోతికి ‘సూపర్‌’ ఆఫర్‌

పట్నా: లాక్‌డౌన్‌ సమయంలో తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని 1200 కిలో మీటర్ల దూరం ప్రయాణించిన బిహార్‌ సాహస బాలిక జ్యోతి కుమారికి పట్నాలోని ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థ సూపర్‌-30 అరుదైన అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 8వ తరగతి చదువుతున్న జ్యోతి.. భవిష్యత్‌లో ఐఐటీకి సన్నద్ధమవ్వాలనుకుంటే తాము ఉచితంగా శిక్షణ ఇస్తామని సూపర్‌-30 వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు తన సోదరుడిని జ్యోతి ఇంటికి పంపి ఆ విషయాన్ని వారికి చెప్పించారు. జ్యోతి, ఆమె తండ్రిని తన సోదరుడు కలుసుకున్న ఫొటోను ఆనంద్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా.. గతవారం లోక్‌ జనశక్తి పార్టీ జ్యోతి చదువుకయ్యే ఖర్చులన్నీ తాము భరిస్తామంటూ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.   

Updated Date - 2020-05-29T09:09:06+05:30 IST