Viral Video: ఇంటికి రానని మొండికేసిన సింహం.. దాన్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ.. !

ABN , First Publish Date - 2022-01-05T03:04:24+05:30 IST

సింహాన్ని పెంచుకుంటున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సింహం ఇటీవల ఇంట్లోని పారిపోవడంతో దాన్ని వెతికి పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చిందా వనిత!

Viral Video: ఇంటికి రానని మొండికేసిన సింహం.. దాన్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ.. !

ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు జంతువులు అంటే.. సాధారణంగా కుక్కలు, పిల్లులు గుర్తుకు వస్తాయి. కొందరు సింహాల్నీ, పులుల్ని పెంచుకుంటారన్న వార్తలు కూడా వింటుంటా..! ఇటువంటి వాళ్లు క్రూర మృగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. వాటి వాలకాన్ని ఎప్పటికప్పుడూ ఓ కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉంటారట. ఇదే విధంగా.. సింహాన్ని పెంచుకుంటున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సింహం ఇటీవల ఇంట్లోంచి పారిపోవడంతో దాన్ని వెతికి పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చిందా వీర వనిత!  సింహం ఏమో నేను ఇంటికి రానంటూ మారం చేస్తున్నట్టు కనిపిస్తే.. ఆమేమో అదేం కుదరదంటూ దాన్ని బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్లుతుంది. ఇదంతా చూసిన నెటిజన్లు..  సింహం కాస్త చిన్నగానే ఉన్నప్పటికీ.. దానితో పారాచకాలేంటి అంటూ అవాక్కైపోతున్నారు. కువెయిత్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. 


ఆమెకు సింహం ఎంతకీ లొంగకపోవడంతో.. మరికొందరి సాయంతో  దాన్ని  తన ఇంట్లోకి తీసుకెళ్లిందట ఆ మహిళ. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇటువంటి క్రూర మృగాలను ఇళ్లలో పెంచుకోవడం చట్ట వ్యతిరేకమైనా కూడా  గల్ఫ్ దేశాల్లో అనేక మంది చిరుతలను, సింహాలను పెంచుకునేందుకు ఇష్టపడతారట. అయితే.. ఇటీవల కాలంలో అక్కడి అధికారులు ఈ వ్యవహారానికి బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 



Updated Date - 2022-01-05T03:04:24+05:30 IST