Advertisement
Advertisement
Abn logo
Advertisement

అల్లం, వెల్లుల్లి సూప్‌

కావలసిన పదార్థాలు: వెల్లుల్లి - 8 రెబ్బలు, అల్లం - అరంగుళం ముక్క, నెయ్యి - అర టీ స్పూను, క్యారెట్‌ తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, నీరు - 3 కప్పులు,  మిరియాల బరక - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు.


తయారుచేసే విధానం: కడాయిలో నెయ్యి వేసి దంచిన వెల్లుల్లి, అల్లం వేగించాలి. తర్వాత క్యారెట్‌ తరుగు కూడా మగ్గించి, ఉప్పు, మిరియాల బరకతో పాటు నీరు పొయ్యాలి. 5 నిమిషాల తర్వాత అరకప్పు నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ని కలిపి మరో 3 నిమిషాలు మరిగించి కొత్తిమీర చల్లి వడ్డించాలి.  

చిక్కుడుకాయ రసంనూడుల్స్‌ సూప్‌ ఉల్లిపాయ సూప్బెండకాయ సూప్‌గుమ్మడికాయ సూప్బీరకాయ సూప్‌సొరకాయ సూప్‌పెస్టో పాస్తా సలాడ్‌ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌క్యారెట్‌ టొమాటో సూప్‌
Advertisement