ఏసీబీ వలలో GHMC ఉద్యోగులు

ABN , First Publish Date - 2021-10-13T12:37:49+05:30 IST

ఆస్తిపేరు మార్పిడికి లంచం తీసుకుంటూ ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మెహిదీపట్నానికి చెందిన మామిడి

ఏసీబీ వలలో GHMC ఉద్యోగులు

హైదరాబాద్/ఖైరతాబాద్‌: ఆస్తిపేరు మార్పిడికి లంచం తీసుకుంటూ ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మెహిదీపట్నానికి చెందిన మామిడి జ్ఞానేశ్వర్‌ తమ ఆస్తిని పేరు మార్పిడి చేయాలని సర్కిల్‌-12లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈనెల 8న ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కౌశిక సురేష్‌కుమార్‌ను సంప్రదించగా రూ.6వేలు లంచం డిమాండ్‌ చేశారు. రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకున్న జ్ఞానేశ్వర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఖైరతాబాద్‌ కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా బిల్‌ కలెక్టర్‌ రాజేశ్వర్‌ను, సురేష్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-10-13T12:37:49+05:30 IST