జీహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సమాచారం

ABN , First Publish Date - 2020-07-14T01:33:59+05:30 IST

కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు సమాచారం పేషెంట్‌ల ఐడీల వారీగా వార్డు, సర్కిల్‌, జోనల్‌ సమాచారంతో జీహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జీహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సమాచారం

హైదరాబాద్‌: కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు సమాచారం పేషెంట్‌ల ఐడీల వారీగా వార్డు, సర్కిల్‌, జోనల్‌ సమాచారంతో జీహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వివరాలను రోజువారీగా అప్‌డేట్‌చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, కాలనీ అసోసియేషన్లు ఈ వివరాలను చూసుకుని కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-07-14T01:33:59+05:30 IST