కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు హోం ఐసొలేషన్‌ కిట్లు

ABN , First Publish Date - 2020-07-14T01:05:01+05:30 IST

జీహెచ్‌ఎంసి పరిధిలో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినప్పటికీ ఇంటి వద్దనే ఉంటూ వైద్య సేవలు పొందుతున్న వారికి హోం ఐసొలేషన్‌ కిట్‌లను అందజేస్తున్నట్టు జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు

కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు హోం ఐసొలేషన్‌ కిట్లు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసి పరిధిలో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినప్పటికీ ఇంటి వద్దనే ఉంటూ వైద్య సేవలు పొందుతున్న వారికి హోం ఐసొలేషన్‌ కిట్‌లను అందజేస్తున్నట్టు జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీహెచ్‌ఎంసి ద్వారా 20వేల హోంఐసొలేషన్‌కిట్‌లను తెప్పించినట్టుఆయన తెలిపారు. వాటిలో 15వేలకిట్‌లను ఇప్పటికే పంపిణీ చేసినట్టు ఆయన వెల్లడించారు. మరో 5వేల కిట్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. కేసులు సంఖ్యను బట్టి హోం ఐసొలేషన్‌ కిట్‌లను తెప్పించి అందజేయనున్నట్టు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 17 రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండాలని తెలిపారు. అందుకనుగుణంగా తొందరగా కోలుకునేందుకు దోహదపడే తొమ్మిది రకాల వస్తువులు ఇస్తున్నట్టు తెలిపారు.


ప్రతి కిట్‌లో విటమిన్‌ సి ట్యాబ్లెట్లు 34, జింక్‌ ట్యాబ్లెట్లు 17, బికాంప్లెక్స్‌ టాబ్లెట్స్‌ 17, శానిటైజర్‌బాటిల్‌ 1, హ్యాండ్‌వాష్‌లిక్విడ్‌ బాటిల్‌, గ్లౌజ్‌లు, సోడియం హైపోక్టోరైడ్‌ ద్రావణంతోపాటు హోం ఐసొలేషన్‌ బ్రోచర్‌ను ఇస్తున్నామన్నారు. హోం ఐసొలేషన్‌ కిట్‌ కవర్‌పై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను సెల్‌పోన్‌ ద్వారా స్కాన్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌-19 నియంత్రణకు జారీ చేసిన సలహాలు,  సూచనలు లభిస్తాయని చెప్పారు. జీహెచ్‌ఎంసి జోనల్‌కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఆయా ప్రాంతాల మెడికల్‌ఆఫీసర్లపర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ద్వారా పాజిటివ్‌ కేసులు నమోదైన ఇండ్లకు వెళ్లి నేరుగా అందజేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-07-14T01:05:01+05:30 IST