Advertisement
Advertisement
Abn logo
Advertisement

ద్వారకా తిరుమలలో ఘరానా మోసం

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఘరానా మోసం వెలుగు చూసింది. యూనియన్ బ్యాంక్ దగ్గర రైతు నుంచి రూ.1.10 లక్షలను కేటుగాడు కాజేసాడు. క్రాప్ లోన్ కట్టడానికి బ్యాంకుకు రైతు ఈశ్వరరావు వచ్చాడు. బ్యాంక్ ఉద్యోగినని చెప్పి నగదు తీసుకుని డమ్మీ ఓచర్‌ను ఈశ్వరరావుకు కేటుగాడు ఇచ్చాడు. తాను మోసపోయానని గ్రహించి పోలీసులను రైతు ఈశ్వరరావు ఆశ్రయించాడు. బ్యాంక్ సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు.  

Advertisement
Advertisement