ఘంటసాలకు భారతరత్న పురస్కారం లభించేలా కృషి చేయాలి: ఎన్నారై తెలుగు సంఘాల పిలుపు

ABN , First Publish Date - 2022-03-22T02:01:43+05:30 IST

స్వాతంత్ర సమరయోధుడు, అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర సందర్భముగా ఆ అమరగాయకుడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో అమెరికాలోని శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 30 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించారు.

ఘంటసాలకు భారతరత్న పురస్కారం లభించేలా కృషి చేయాలి:  ఎన్నారై తెలుగు సంఘాల పిలుపు

స్వాతంత్ర సమరయోధుడు, అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు  శత జయంతి సంవత్సర సందర్భముగా ఆ అమరగాయకుడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో అమెరికాలోని శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 30 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. తద్వారా ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు ఈ కార్యక్రమాల నిర్వాహుకులు తెలిపారు.


అందులో బాగంగా రెడ్డి ఊరిమిండి నిర్వహణలో 20 మార్చి 2022  నాడు జరిగిన అంతర్జాల (zoom)  కార్యక్రమములో బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో  తెలుగువారు ఒక్కరు కూడా లేకపోవడం బాధాకరం విషయం అని అన్నారు. అన్నమాచార్య భువనవాహిని సంస్థ అధ్యక్షురాలు, పద్మశ్రీ శోభారాజు పాల్గొని ఘంటసాలకి భారతరత్న ఇవ్వడం ఆ అమరగాయుడికి ఘనమైన నివాళి అని తెలిపారు. ఘంటసాల పాటలలో కొన్ని ఆణిముత్యాలను పాడి ప్రేక్షకులను అలరించారు.   


సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, అట్లాంటా నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. పాలక మండలి సభ్యులు శ్రీని రెడ్డి వంగిమళ్ళ, దక్షిణ ఆఫ్రికా నుండి దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ అధ్యక్షులు విక్రమ్ పెట్లూరు, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ కడించెర్ల, ఖతార్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు ఉసిరికల్ల తాతాజీ, నార్వే నుంచి వీధిఅరుగు అధ్యక్షులు వెంకట్ తరిగోపుల, యూఏఈ నుంచి తెలుగు తరంగిణి అధ్యక్షులు వెంకట సురేష్, లండన్ నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ ఉపాధ్యక్షులు రాజేష్ తోలేటి తదితరులు పాల్గొని..  ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి  సంబంధించిన విషయమని, ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్ధించారు.  ఈ దిశగా విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ అని తెలిపారు.  


ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల  సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులుతో పాటు, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 33 కి పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉదృతం చేసి ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరిని సంఘటితం చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.



Updated Date - 2022-03-22T02:01:43+05:30 IST