జియోట్యాగింగ్‌తో పెన్షన్లు

ABN , First Publish Date - 2020-03-31T09:02:42+05:30 IST

కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పెన్షన్ల పంపిణీ లోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏప్రిల్‌లో పంపిణీ చేసే పెన్షన్లను బయోమెట్రిక్‌ విధానంలో కాకుండా జియోట్యాగింగ్‌ ద్వారా ఇచ్చేందుకు సెర్ప్‌

జియోట్యాగింగ్‌తో పెన్షన్లు

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పెన్షన్ల పంపిణీ లోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏప్రిల్‌లో పంపిణీ చేసే పెన్షన్లను బయోమెట్రిక్‌ విధానంలో కాకుండా జియోట్యాగింగ్‌ ద్వారా ఇచ్చేందుకు సెర్ప్‌ చర్యలు తీసుకుంది. వలంటీర్‌ తనకు కేటాయించిన 50 కుటుంబాల వద్దకు వెళ్లి పెన్షన్‌దారులకు నగదు నేరుగా అందిస్తారని, పెన్షన్‌ తీసుకుంటున్న సమయంలో సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తారని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. వృద్ధు లు, వికలాంగులు, వితంతువులెవరైనా, ఎక్కడి నుంచైనా పెన్షన్‌ పొందేందుకు పోర్టబులిటీ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు.

Updated Date - 2020-03-31T09:02:42+05:30 IST