Abn logo
Feb 27 2021 @ 03:45AM

జియో సరికొత్త ఆఫర్‌

  • రెండేళ్లు అపరిమిత కాల్స్‌.. ప్రతి నెల 2జీబీ డేటా
  • ఫోన్‌ ధర రూ.1,999 

రిలయన్స్‌ జియో.. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం సరికొత్త బండిల్డ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ సేవల నుంచి భారత్‌ను విముక్తం చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా అందుబాటు ధరల్లో కొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. న్యూ జియోఫోన్‌ 2021 ఆఫర్‌ పేరుతో రెండేళ్ల పాటు అన్‌లిమిటెడ్‌ వాయుస్‌ కాల్స్‌, ప్రతి నెల 2 జీబీ డేటాతో కొత్త ఫోన్‌ను జియో విడుదల చేసింది. మార్చి 1 నుంచి ఈ కొత్త ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. భారత్‌ 5జీ లోకి అడుగుపెడుతున్న సమయంలో కూడా 30 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఇంకా బేసిక్‌ ఫీచర్లతో 2జీ ఫోన్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని, వీరందరికీ అత్యుత్తమ సేవలందించాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. కొత్త యూజర్లకు రూ.1,999 ధరకే జియో ఫోన్‌ను ఇవ్వటంతో పాటు రెండేళ్ల పా టు అపరిమిత కాల్స్‌, ప్రతి నెల 2జీబీ హైస్పీడ్‌ డేటాను ఈ ఆఫర్‌ ద్వారా అందించనున్నట్లు వెల్లడించింది. అలాగే 1,499 ధరతో ఏడాది పాటు ఇదే తరహా సేవలతో ఫోన్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement