Abn logo
Aug 2 2020 @ 03:46AM

కోహ్లీ సూపర్‌ ఇన్నింగ్స్‌ల్లో అదొకటి

గౌతం గంభీర్‌

న్యూఢిల్లీ: ఛేదనలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ క్రీజులో ఒక్కసారి  నిలదొక్కుకుంటే ఆ తర్వాత ఎలా చెలరేగుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ ‘బెస్ట్‌ ఆఫ్‌ ఆసియా కప్‌’ అనే కార్యక్రమాన్ని మాజీ ఓపెనర్‌ గంభీర్‌తో నిర్వహించగా అందులో 2012 ఆసియాక్‌పలో విరాట్‌ సాధించిన సూపర్‌ సెంచరీ గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ‘2012 ఆసియాక్‌పలో పాకిస్థాన్‌పై విరాట్‌ సాధించిన ఆ అజేయ శతకం (148 బంతుల్లో 183) అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి. అప్పుడు మా ముందు 330 పరుగుల భారీ లక్ష్యముంది. నేను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరా. వన్‌డౌన్‌లో దిగిన కోహ్లీ రెండో వికెట్‌కు సచిన్‌తో కలిసి 133, రోహిత్‌తో కలిసిమూడో వికెట్‌కు 172 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను విజయం దిశగా నడిపించాడు. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని విరాట్‌ పాక్‌ వంటి బలమైన ప్రత్యర్థిపై ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆడిన ఆ ఇన్నింగ్స్‌ అతడి కెరీర్‌లోనే ఉత్తమమైనది’ అని కోహ్లీని గంభీర్‌ ఆకాశానికెత్తాడు.

Advertisement
Advertisement
Advertisement